వరద ఉధృతిలో 8 నెలల గర్భిణి

వరద ఉధృతిలో 8 నెలల గర్భిణి

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలం జల్దా గ్రామానికి చెందిన జాదవ్​​ జయశ్రీ 8 నెలల గర్భిణి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పురిటి నొప్పులు రావడంతో 108లో ఆసుపత్రికి తరలించాలని భావించారు. ఇచ్చోడ ఆసుపత్రి దగ్గరున్న వాగు పొంగి.. వరద ఉధృతికి వంతెన తెగి రోడ్డు కొట్టుకుపోయింది. రాకపోకలు నిలిచిపోవడంతో 108 అంబులెన్స్​ గ్రామానికి వెళ్లలేకపోయింది. దాంతో జయశ్రీని జల్దా నుంచి గేర్జం, జామిడి గ్రామాల మీదుగా ఇచ్చోడ బైపాస్​ రోడ్డు వరకు ఆటోలో తరలించారు. అక్కడ అండర్​బ్రిడ్జి నుంచి చేతుల మీద మోస్తూ బైపాస్​ రోడ్డు పైకి ఎక్కించారు. అక్కడ నుంచి అంబులెన్స్​లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మొదటి కాన్పులో ముందస్తు నొప్పులు వస్తాయని, కాన్పు కోసం ఇంకా టైమ్​ ఉందని ఆమెను పరీక్షించిన డాక్టర్​ సాగర్​ చెప్పారు. ఒక రోజు ఆసుపత్రిలోనే అబ్జర్వేషన్​లో ఉంచి డిశ్చార్జ్​ చేస్తామన్నారు.