కాగజ్ నగర్, వెలుగు: ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సిర్పూర్(టి) మండలంలోని వెల్లి గ్రామానికి చెందిన గౌర్కర్ బేబీకి శుక్రవారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో కాగజ్నగర్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటీ విజయ్ తెలిపారు.
