వైద్యుల నిర్లక్షంతో గర్భిణీ మృతి.. బంధువుల ఆందోళన

వైద్యుల నిర్లక్షంతో గర్భిణీ మృతి.. బంధువుల ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఒ గర్భిణీ మృతి చెందింది. సంస్థాన్ నారాయణపుర్ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన శ్యామల కల్పన అనే మహిళ డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరింది. అయితే డెలివరీ చేసిన గంటకు ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వైద్యుల ఆమెను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. మార్గ మధ్యలోనే కల్పన చనిపోయింది. వైద్యురాలి నిర్లక్షం కారణంగానే ఆమె మృతి చెందిందని బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చౌటుప్పల్ ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు.