చైనా మాంజా విక్రయించొద్దు : సీపీ రష్మీ పెరుమాళ్

చైనా మాంజా విక్రయించొద్దు :  సీపీ రష్మీ పెరుమాళ్
  •     సీపీ రష్మీ పెరుమాళ్

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజాను విక్రయించొద్దని సీపీ రష్మీ పెరుమాళ్ హెచ్చరించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చైనా మాంజా వల్ల బైక్ రైడర్లు, పాదచారులతో పాటు పక్షులు తీవ్రంగా గాయపడుతున్నాయన్నారు. 

నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా, అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా చైనా మాంజా విక్రయిస్తుంటే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

చైనా మాంజా స్వాధీనం

సిద్దిపేట రూరల్: పట్టణంలోని ఓ షాపులో 35 చైనా మాంజా రోల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. శనివారం చైనా మాంజాను విక్రయిస్తున్నారన్న సమాచారంతో దుకాణంపై దాడులు చేసి మాంజా రోల్స్ ను గుర్తించామన్నారు. విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.