- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావుతో కలిసి ఆయన శనివారం ఆవిష్కరించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్రాబాద్ మాజీ జడ్పీటీసీ డాక్టర్ అనురాధ, నాయకులు గోపాల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
