గొల్లభామ చీరలతో జిల్లాకు గుర్తింపు : కలెక్టర్ హైమావతి

గొల్లభామ చీరలతో జిల్లాకు గుర్తింపు :  కలెక్టర్ హైమావతి
  •     కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: గొల్లభామ చీరలతో జిల్లాకు మంచి గుర్తింపు లభించిందని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని తుమ్మ లక్మణ్ నేతృత్వంలోని సొసైటీలో ఉన్న గొల్లభామ చీరలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలు చూడగానే ఆకట్టుకునే విధంగా చీరలు ఉన్నాయన్నారు. గొల్ల బామ చీరల చరిత్ర, నేసే విధానం, ఇతరత్రా వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. 

గొల్లభామ చీరలు జిల్లాకు ఒక బ్రాండ్ అని అన్నారు. ఈ చీరలను ప్రతి మహిళకు చేరేలా ప్రమోట్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరిదని సూచించారు. కలెక్టర్ వెంట ఏడీ హ్యాండ్లూమ్స్ సాగర్ ఉన్నారు. అనంతరం అక్బర్ పేట-భూం పల్లి మండలంలోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను పరిశీలించారు. అటెండెన్స్, ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. మెడికల్ ఆఫీసర్ నుంచి సిబ్బంది వరకు రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు.