
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ హెల్త్ రన్ మారథాన్ ఈవెంట్‌లో ప్రేమ్‌చంద్ విజేతగా నిలిచాడు. గచ్చిబౌలి స్టేడియంలో సిద్స్ ఫార్మ్స్ ఆదివారం నిర్వహించిన మారథాన్ 10కె రన్ (అండర్ 18 –40 కేటగిరీ) పోటీలో ప్రేమ్ చంద్ 32 నిమిషాల 46 సెకన్లలో అగ్రస్థానం సాధించాడు.
విమెన్స్‌లో నెలిసివే జిసినిల్ మాగోంగో ( 45 ని. 32సె) టైటిల్ సొంతం చేసుకోగా.. 5కె కేటగిరీలో మెన్స్‌లో కేవీబీ రెడ్డి (19 ని 57సె), విమెన్స్‌లో పింకీ గుప్తా (27 ని 06 సె) విజేతలుగా నిలిచారు. రెండు వేల మంది రన్నర్స్ పాల్గొన్నారు. టి–హబ్ సీఈవో శ్రీనివాస్ రావు, వి–హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల, ఐఎస్‌ఎఫ్ విష్ణు వర్దన్ రెడ్డి, సిద్స్ ఫార్మ్స్ ఎండీ డాక్టర్ కిషోర్ ఇందుకూరి విన్నర్లకు మెడల్స్ అందజేశారు.