చదువు ఆపేసిన బాలికలను గుర్తించాలి : ప్రేమలత అగర్వాల్

చదువు ఆపేసిన బాలికలను గుర్తించాలి : ప్రేమలత అగర్వాల్
  • రాష్ట్ర చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు ప్రేమలత అగర్వాల్

ఆర్మూర్, వెలుగు: అనివార్య కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన బాలికలను గుర్తించి  ఓపెన్ స్కూల్, ఓపెన్ ఇంటర్ సొసైటీ ఆధ్వర్యంలో పరీక్షలు రాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని  చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు ప్రేమలత అగర్వాల్ అన్నారు. మంగళవారం ఆర్మూర్ లో  పలు మహిళా ప్రాంగణాలు, టౌన్ లోని జడ్పీ గర్ల్స్, బాయ్స్​ స్కూల్స్​ ను ఆమె సందర్శించారు. 

ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. బాల్య వివాహాలు చేసుకోవద్దన్నారు. గవర్నమెంట్​ స్కూల్స్​ లో ప్రభుత్వం అందిస్తున్న వసతులు, సౌకర్యాలు ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. డీఈవో అశోక్ కుమార్, డీడబ్ల్యూవో రసూల్ బీ, ఎంఈవో పింజ రాజ గంగారం, హెడ్మాస్టర్స్ లక్ష్మీ నర్సయ్య, వనజా రెడ్డి, మహిళా ప్రాంగణం మేనేజర్ ఇందిర పాల్గొన్నారు.