
- మెడికవర్ లో 565 గ్రాములతో పుట్టిన ఆడ శిశువు
- 115 రోజుల ట్రీట్మెంట్తో ఆరోగ్యంగా డిశ్చార్జ్
మాదాపూర్, వెలుగు: మాదాపూర్ మెడికవర్ ఉమెన్ అండ్ చిల్ర్డన్ హాస్పిటల్లో 23 వారాలకే పుట్టిన శిశువును డిశ్చార్జ్ చేశారు. తక్కువ సమయంలో పుట్టిన శిశువులు బతకడం అరుదని, కానీ తమ హాస్పిటల్లో విజయవంతంగా చికిత్స అందజేసి ఆరోగ్యంగా ఇంటికి పంపామని డాక్టర్లు ప్రకటించారు. గురువారం మాదాపూర్లోని హాస్పిటల్లో నియోనాటాలజిస్ట్ చీఫ్ కన్సల్టెంట్డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే వివరాలు వెల్లడించారు.
సొమాలియాకు చెందిన మహిళ ఏప్రిల్18న మాదాపూర్ మెడికవర్లో 23 వారాలకే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కేవలం565 గ్రాములు ఉండడంతో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించి 115 రోజుల పాటు చికిత్స అందజేశారు. ఈ నెల 11న 2 కిలోల బరువు పెరగడంతో డిశ్చార్జ్ చేశారు. ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక, డాక్టర్లు నవిత, వంశీ రెడ్డి, ప్రశాంతి, హెడ్ నర్స్ థామస్,సెంటర్ హెడ్ ప్రసాద్, సూపరింటెండెంట్ వెంకట్ ఉన్నారు.