ఇక రాష్ట్రంలోనే స్టెంట్ల తయారీ

ఇక రాష్ట్రంలోనే స్టెంట్ల తయారీ
  • 20 ఎకరాల్లో రూ.250 కోట్లఖర్చుతో నిర్మాణం
  • పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమగా రికార్డు
  • అతి తక్కువ ధరకే స్టెంట్లు అందుబాటులోకి..

ఆసియాలోనే అతిపెద్ద మెడికల్ పరికరాల పరిశ్రమ రాష్ర్టం లో ఏర్పాటవుతోంది. ఎస్ఎంటీ (సహజానంద్ మెడికల్టె క్నాలజీస్) పరిశ్రమను సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైసెస్ పా ర్క్​లో నిర్మించేందుకు మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు . గుండెకు సంబంధించి అరుదైన స్టెంట్లను ఎస్ఎంటీ ఇక్కడ ఉత్పత్తి చేయనుంది. దీంతో ఇప్పటి వరకు ఐటీ హబ్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ ఇకపై మెడికల్ హబ్ గా గుర్తింపు పొందనుంది. ప్రారంభోత్సవానికి ఎస్ఎంటీ చైర్మన్ ధీరజ్ రాజ్ కటారియా, ఎండీ భార్గవ్ కటారియా, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు , ఎండీ జయేశ్ రంజన్,ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి , ఎమ్మె ల్సీ భూపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

రూ.50 వేలలోపే స్టెంట్…

దుబాయ్ కేంద్రంగా ఎస్ఎంటీ పని చేస్తోంది. ప్రపంచంలోని 70 దేశాల్లో తమ ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది. 20 ఎకరాల్లో రూ.250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దేశంలో గుండె జబ్బులతో బాధపడే వారికి అమర్చే స్టెంట్ కు లక్షల రూపాయల్లో ఖర్చవుతోంది. స్టెంట్ల కోసం ఎక్కువగా యూరోపియన్ దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎస్ఎంటీ పరిశ్రమ ఏర్పాటు తో ప్రొడక్షన్, ట్రాన్స్​పోర్టేషన్ ఖర్చుతగ్గి తక్కువ ధరలోనే స్టెంట్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమైతే కేవలం 50 వేల లోపు ధరకే స్టెంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు . ఇదే బాటలో దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడులతో డయాలసిస్ పరికరాలు, డయాబెటిస్ ఇన్సులిన్లు, మెడికేటెడ్ బ్యాండేజ్ తదితర తయారీ పరిశ్రమలు కూడా మెడికల్ డివైజెస్ పార్కులో ఏర్పాటు కానున్నాయి.

2017లోనే శంకుస్థాపన….

దేశంలోనే తొలిసారిగా వైద్య పరికారాలు తయారు చేసే పారిశ్రామిక వాడను సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో ఏర్పాటు చేసేందుకు 2017లోనే అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు . 545 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్​లో దాదాపు 2 వేల కోట్ల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నయి. ఇందులో 50 ఎకరాలను మహిళా పారిశ్రామిక వేత్తలకు, 220 ఎకరాలను కామన్ ఇండస్ట్రియల్ కారిడార్ కు ప్రభుత్వం ప్రతిపాదించింది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు వంద ఎకరాల్లో మెడికల్ పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగాయి. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల వల్ల ప్రత్యేక్షం గా, పరోక్షంగా సుమారు 25 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇక్కడే మరో 350 ఎకరాలను ఇండస్ట్రియల్ కారిడార్ కు కేటాయించేందుకు ప్రభుత్వం ఈ మధ్యే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

కేసీఆర్, కేటీఆర్ వల్లే ఇన్ని పరిశ్రమలు: ఈటల

సీఎం కేసీఆర్ వల్ల, గతంలో మంత్రిగా పని చేసిన కేటీఆర్ వల్లే రాష్ర్టానికి ఇన్ని పరిశ్రమలు వస్తున్నా యని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు . ‘‘తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ కరెంట్ సరఫరాకు ఇబ్బందులు ఉండేవి. సమైక్య పాలనలో కరెంట్ సమస్యపై పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలకు 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తోంది. ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు మొందుకొస్తున్నారు . సింగి ల్ విండో విధానంలో పరిశ్రమలకు త్వరగా అనుమతులు ఇస్తున్నాం” అని వివరించారు. ఎంతో విలువైన భూములను తక్కువ ధరలకే కేటాయిస్తున్నందుకు ప్రతిఫలంగా పారిశ్రామిక వేత్తలు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. వైద్యం వ్యాపా రంగా మారిన ఈ రోజుల్లో సామాన్యులకు తక్కువ ధరకు స్టెంట్స్​ అందుబాటులోకి తెచ్చేందుకు ముందు కొచ్చిన ఎస్ఎంటీ సంస్థను అభినందించారు.

పొల్యూషన్ ఫ్రీ మెడికల్ ఇండస్ట్రీలు: మల్లా రెడ్డి

రాష్ట్రంలో ఇకపై వచ్చేవన్నీ కాలుష్య రహిత మెడికల్ పరిశ్రమలేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు .‘‘పారిశ్రామిక రంగంలో రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధిం చింది. తెలంగాణ వచ్చాక పారిశ్రామిక ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ ఫండ్స్​ను స్థానికంగానే వినియోగించాలి. చిన్నగ్రామాల అభివృద్ధికి సహకరించాలి” అని కోరారు. ఎస్ఎంటీ ఉత్పత్తి చేసే స్టెంట్స్​ను రాష్ర్టం లోని ఆసుపత్రులకు తక్కువ ధరకు అందించాలన్నారు .