‘అమృత్ 2.0’ ప్లాన్ రెడీ చేయండి

V6 Velugu Posted on Oct 14, 2021

కాశిబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: సిటీలో అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 వర్క్స్ కు ప్లాన్ రెడీ చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం బల్దియా హెడ్ ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఆయా పథకాల కింద సిటీలో అండర్ డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, ఫ్రెష్ వాటర్ మేనేజ్ మెంట్, థీమ్ పార్క్ వాటర్ హార్వెస్టింగ్ అభివృద్ధి చేస్తామన్నారు. ప్రొక్యూర్ మెంట్ పద్ధతిలో వెహికల్స్ కొనుగోలు చేస్తామన్నారు. అలాగే కమ్యూనిటీ సెప్టిక్ ట్యాంకులు, సీవరేజీ ట్రీట్​మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ లను ఆఫీసర్లు రెడీ చేయాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్​వో డాక్టర్ రాజారెడ్డి, ఆస్కి డైరెక్టర్ డా.శ్రీనివాసా చారి, ఫ్రొ. డా.మాలిని రెడ్డి, రాజ్ మోహన్ రెడ్డి తదితరులున్నారు.

Tagged plan, Prepare, , Amrut 2.0

Latest Videos

Subscribe Now

More News