కేసీఆర్‌‌‌‌ను జనం నమ్మే పరిస్థితి లేదు : ​జానారెడ్డి

కేసీఆర్‌‌‌‌ను జనం నమ్మే పరిస్థితి లేదు : ​జానారెడ్డి

హాలియా, వెలుగు :  సీఎం కేసీఆర్‌‌‌‌ను జనం నమ్మే పరిస్థితి లేదని మాజీ సీఎల్పీ లీడర్​కుందూరు జానారెడ్డి అన్నారు. సోమవారం అనుముల మండలం శ్రీనాథపురం గ్రామ ఎంపీటీసీ కొండ రమేశ్, చింతగూడెం సర్పంచ్​ కూరాకుల లింగమ్మ, హాలియా మున్సిపాలిటీలోని ఆర్య క్షత్రియ సంఘం నాయకులు,  త్రిపురారం మండలం  అంజనపల్లి, రాగడప, గంటారావు క్యాంపు గ్రామాలకు చెందిన 300 మంది బీఆర్‌‌‌‌ఎస్‌‌కు రిజైన్ చేసి కాంగ్రెస్‌‌లో చేరారు.  ఈ సందర్భంగా జానా రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌‌‌‌ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేకుండానే కొత్త హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు.  తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీమ్‌‌లు అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జయవీరు కుందూరు, నేతలు కందూరు వెంకట్​ రెడ్డి,  మలిగిరెడ్డి లింగారెడ్డి,  చింతల చంద్రారెడ్డి, కుందూరు రాజేందర్ రెడ్డి,   రమేశ్ యాదవ్, మల్ రెడ్డి భానుచందర్ రెడ్డి, నకిరేకంటి సైదులు తదితరులు పాల్గొన్నారు.