శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాల సమర్పణ

శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాల సమర్పణ

కర్నూలు: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  ఇవాళ ఆదివారం ఉత్సవాలల్ నాల్గవ రోజు సందర్భంగా స్వామి అమ్మవార్లకు  విశేషపూజలు జరిగాయి. లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు జరుగుతున్నాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం తరపున ఈవో వారి సిబ్బంది శ్రీశైల మల్లన్న దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు, ప్రధాన అర్చకులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికిన అనంతరం పట్టువస్త్రాలు సమర్పణ జరిగింది. సాయంత్రం మయూర వాహన సేవ జరగనిం. ఈ సందర్భంగా టీటీడీ దేవస్థానం వారు పట్టువస్త్రాల సమర్పిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్ల  గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద  సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.