యశ్వంత్ సిన్హాను కలిసేది లేదు 

యశ్వంత్ సిన్హాను కలిసేది లేదు 

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నిర్వహించిన హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్ లో కాక రేపింది. హైదరాబాద్ జలవిహార్ లో యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. యశ్వంత్ సిన్హాను సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్  కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. టీఆర్ఎస్ కలిసిన వ్యక్తిని తాము కలవడం జరగదని, వ్యక్తిగతంగా కలిసి ఉండొచ్చన్నారు. కేటీఆర్ పై సెటైర్స్ వేశారు. ఢిల్లీలో కేటీఆర్ ను ఎవరు గుర్తు పడుతారని ఎద్దేవా చేశారు. 
 

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు బరిలో నిలిచారు. యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ మద్దతిచ్చింది. టీఆర్ఎస్ ఆయనకు మద్దతు పలికింది.  ప్రచారంలో భాగంగా యశ్వంత్ హైదరాబాద్ కు వచ్చారు. ఆయనకు టీఆర్ఎస్ ఘన స్వాగతం పలికింది. పదివేల బైక్స్ తో ఊరేగింపు జరిపింది. ఈ క్రమంలో.. యశ్వంత్ సిన్హాను సీఎల్పీ కార్యాలయానికి పిలిస్తే బాగుండేదనే అభిప్రాయాలు ఆ పార్టీలో వ్యక్తమౌతున్నాయి. అలా జరగకపోవడానికి కారణం సీఎల్పీ నేత వైఖరే కారణమని, దీనిపై కాంగ్రెస్ అధిష్టానికి లేఖ రాస్తానని జగ్గారెడ్డి వెల్లడించినట్లు సమాచారం. యశ్వంత్ సిన్హాను టీ. కాంగ్రెస్ నేతలు కలవకపోవడంపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.