విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్రపతి

విజిటర్స్ ఫెసిలిటేషన్  సెంటర్ను ప్రారంభించిన రాష్ట్రపతి

రాష్ట్రపతి నిలయంలో విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఫ్లోరల్ క్లాక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వర్చువల్ గా ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఫ్లోరల్ క్లాక్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ్ సై, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. తర్వాత రాష్ట్రపతి ప్రాంగణంలో చేనేత హస్తకళలు ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు గవర్నర్ తమిళి సై, మంత్రి పొన్నం. 

మహిళలు లేకుండా మనుగడ లేదు

జీవితంలో మహిళలు లేకుండా పురుషులు మనుగడ సాగించలేరన్నారు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్. మహిళలకు సంకల్ప శక్తి ఎక్కువని.. వాళ్లు తలుచుకుంటే ఏదైనా  సాధించగలరన్నారు. 

ALSO READ :- మోడీనైనా..కేడీనైనా ఎదిరిస్తా : సీఎం రేవంత్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని  ముందస్తుగా రాచకొండ కమిషనరేట్ లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో వివిద రంగాల్లో సత్తా చాటిన మహిళలు పాల్గొన్నారు.