జులై 04న హైదరాబాద్‌‌కు ప్రెసిడెంట్​ ముర్ము

జులై 04న హైదరాబాద్‌‌కు ప్రెసిడెంట్​ ముర్ము

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సంద ర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి (నల్లకుంట) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్లూరి సీతా రామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొంటారు. ఈ క్రమంలో ఉద యం 10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌‌ఫోర్స్ స్టేషన్‌కు రాష్ట్ర పతి చేరుకుంటారు. 

అక్కడ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. తర్వాత ఆమె రాజ్ భవన్‌కు వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంట లకు రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత హెలి కాప్టర్‌‌లో 3.40 గంటలకు గచ్చిబౌలిలో అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.