రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్జుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అవార్డులు అందజేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మ అవార్డుల బహూకరణ కార్యక్రమాన్ని విడతలవారీగా నిర్వహిస్తున్నారు. తొలి విడతలో భాగంగా ఇవాళ ఇద్దరికి పద్మ విభూషణ్, 8 మందికి పద్మ భూషణ్, 54 మందికి పద్మ శ్రీ పురస్కారాలు అందజేశారు. 

తెలంగాణకు చెందిన మెట్ల కిన్నెర మొగిలయ్య పుద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులా నబీ ఆజాద్, సీరం ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ దివంగత బిపిన్ రావత్ కు మరణానంతరం ప్రకటించిన పద్మ విభూషణ్ ను ఆయన కూతుళ్లు స్వీకరించారు. రెండో విడత అవార్డుల ప్రదానం మార్చి 28న జరగనుంది.