హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి, ప్రముఖుల స్వాగతం

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి, ప్రముఖుల స్వాగతం

అల్లూరి సీతారామ రాజు 125 వ జయంతి ముగింపు ఉత్సవాలలో భాగంగా గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. 

Also Read : వెల్కటూరులో కాకతీయుల కాలం నాటి.. మరకమ్మ విగ్రహం

ఆమెకు గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, హోం మంత్రి మహమూద్​ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్​, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మేయర్​ గద్వాల విజయలక్ష్మీ, సీఎస్​ శాంతకుమారి తదితరులు పుష్ప గుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు.