హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సంలో ఆమె పాల్గొంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము భారతీయ కళా మహోత్సవ్‌ను ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి సీతక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే సీతక్క ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను ఆమె సమన్వయం చేయనున్నారు.
