- బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు
ముషీరాబాద్,వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన సమగ్ర కులగణనను స్వాగతిస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం హర్షణీయమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ తెలిపారు. కుల గణనకు చట్టం చేయడం మరింత మెరుగైన విధానమని పేర్కొన్నారు. శనివారం బాగ్ లింగంపల్లి లోని కేంద్ర ఆఫీసులో జరిగిన తెలంగాణ మేధావుల మేధోమథన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలో ప్రభుత్వం మారినా అవకాశాల పరంగా బీసీలపై వివక్షత కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నాలుగు మంత్రి పదవులు ఉంటే, కాంగ్రెస్ పాలనలో రెండు మంత్రి పదవులే ఇచ్చారన్నారు.
