మాపై దాడిచేస్తే ఇట్లనే ఉంటది: పుతిన్​ 

మాపై దాడిచేస్తే ఇట్లనే ఉంటది: పుతిన్​ 

మాస్కో: రష్యాపై దాడి చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్​ హెచ్చరించారు. ఉక్రెయిన్​పై మిసైళ్ల వర్షం కురిపించిన తర్వాత సెక్యురిటీ కౌన్సిల్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ‘‘క్రిమియా బ్రిడ్జిని టెర్రరిస్టులు బ్లాస్ట్​ చేశారు. దీని వెనుక ఉక్రెయిన్​ ప్రత్యేక దళాల హస్తం ఉంది. రష్యాపై ఇట్ల దాడులు చేస్తే అస్సలు వదిలిపెట్టం. ఇంతకంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఊహకు కూడా అందని విధంగా దాడులు చేస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు” అని పుతిన్​ వార్నింగ్​ ఇచ్చారు.

ఉక్రెయిన్​ బార్డర్​ నుంచి 85 కిలోమీటర్ల దూరంలోని రష్యాలోని కుర్స్క్​ న్యూక్లియర్​ ప్లాంట్​పై ఉక్రెయిన్​ మూడు సార్లు దాడులు చేసిందన్నారు. నల్లసముద్రంలో రష్యా నుంచి టర్కీ వెళ్లే టార్క్ గ్యాస్​ పైప్​లైన్​ను పేల్చేందుకు 
ప్రయత్నించిందని పుతిన్​ ఆరోపించారు.