ప్రెసిడెంట్ బడ్జెట్ స్పీచ్: మన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం

ప్రెసిడెంట్ బడ్జెట్ స్పీచ్: మన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. కరోనాతో చనిపోయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆయన నివాళులర్పించారు. కరోనాను ఎదుర్కోవడంలో దేశం యావత్తు కలిసి ముందుకెళ్లిందని ఆయన అన్నారు. ఐక్యమత్యమే మహాబలం అని ఆయన అన్నారు. దేశ భవిష్యత్తుకు ఈ దశాబ్దం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ కరోనా, బర్డ్‌ఫ్లూలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఎంత పెద్ద సవాళ్లు అయినా భారత్ ముందు తలవంచాల్సిందే. కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. కరోనా టైంలో మన సామర్థ్యాన్ని ప్రపంచదేశాలకు చూపించాం. ప్రపంచదేశాలను కరోనా వ్యాక్సిన్‌ను మనమే సప్లై చేస్తున్నాం. కరోనా ఎందరో మహనీయులను బలి తీసుకుంది. కరోనాతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సహా మరో ఆరుగురు ఎంపీలు మృతిచెందారు.

భారతీయులు కరోనా కాలంలో కష్టసుఖాలను పంచుకున్నారు. లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన కూలీలను ఆదుకున్నాం. కేంద్ర పథకాలు నిరుపేద మహిళలకు ఆసరగా నిలిచాయి. పేదల కోసం వన్ నేషన్, వన్ రేషన్ పథకాన్ని ప్రారంభించాం. ఆత్మనిర్భర్ ప్యాకేజీతో పేదలకు ఆసరగా నిలిచాం. గత ఆరేళ్లలో ఆరోగ్యరంగంలో చేపట్టిన సంస్కరణలు కరోనాను ఎదుర్కొవడంలో ఎంతో ఉపయోగపడ్డాయి. లాక్‌డౌన్ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో లేకుండా చూశాం.

జనవరి 26న ఎర్రకోటలో జరిగిన ఘటన దురదృష్టకరం. రైతులు జాతీయజెండాను తొలగించడం కరెక్ట్ కాదు. శాంతిభద్రతలను ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను ఉల్లంఘించొద్దు. రైతుల శాంతియుత ఆందోళనలను గౌరవిస్తాం. రైతుల సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత. కొత్త చట్టాలతో చిన్న సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రైతులకు మద్దతు ధర పెంచాం. కొనగోలు కేంద్రాలను కూడా పెంచాం. రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలు తీసుకొచ్చాం. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు చాలా పెరిగాయి. వ్యవసాయరంగం మరింత అభివృద్ది చెందాలి. రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు వేస్తున్నాం.

కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది. లాక్‌డౌన్‌లో విద్యార్థుల కోసం ఆన్‌లైన్ క్లాసులను అందుబాటులోకి తీసుకొచ్చాం. లాక్‌డౌన్ వల్ల విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం.

For More News..

ఒకే శిలపై రెండు శాసనాలు వేయించిన ఇద్దరు మహారాజులు

యూట్యూబ్‌లో చూసి 400 అకౌంట్లు హ్యాక్ చేసిన స్కూల్ డ్రాపౌట్

సర్కారు తీరు మారితేనే మహిళలకు భరోసా