ఈ నెల 20న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి

V6 Velugu Posted on Dec 03, 2021

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఈ నెల 20న నగరానికి వస్తున్నారు. నాలుగు రోజులపాటు రాష్ట్రపతి నిలయంలో ఉంటారు. దీంతో రాష్ట్రపతి నిలయంలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో ఆయా విభాగాల అధికారులు బిజీ అయ్యారు. రాష్ట్రపతి నిలయాన్ని ఆనుకొని ఉన్న  EME పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రత్యేక హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. ప్రథమ పౌరుని పర్యటన సందర్భంగా ఆక్టోపస్‌ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు.

Tagged Hyderabad, President Ramnath Kovind, arrive, 20th, winter retreat

Latest Videos

Subscribe Now

More News