
తెలంగాణ భాష, కళాత్మకతను ఒడిసిపట్టుకున్న మొదటి కవి కాళోజీ అని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల, తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని సోమవారం న్యూసెమినార్ హాల్ లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో తెలంగాణ భాష తీవ్ర వివక్షకు గురైందని చెప్పారు. పత్రికలు, పాఠ్యపుస్తకాలు, సినిమాల్లో తెలంగాణ భాష ను ప్రతి నాయకులకు ఉపయోగించి హీనపరిచారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ భాషకు మేలు జరగలేదన్నారు. తెలంగాణ భాషను ప్రామాణిక భాషగా రూపొందించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ప్రొఫెసర్ చెన్న బసవయ్యను సన్మానించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, ఆచార్య సూర్యధనుంజయ్, వైస్ ప్రిన్సిపాల్ డా.విజయ, డా.కమలాకర శర్మ, డా.సి.కాశిం, ఆర్ట్స్ కళాశాల వివిధ శాఖల అధ్యక్షులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.