కరోనా సెకండ్ వేవ్ చాలా డేంజర్

కరోనా సెకండ్ వేవ్ చాలా డేంజర్

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ తో జాగ్రత్తగా ఉండాలని దేశ రాజధానిలోని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. గతంలో చూసిన దాని కంటే ఈ వేవ్ ప్రమాదకరమన్నారు. అతి తక్కువ సమయంలో రోజుకు 80 వేల కేసులు నమోదవ్వడాన్ని బట్టి మహమ్మారి విజృంభణ ఎంత భీకరంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ఐసోలేషన్ చాలా ముఖ్యమని అని తెలిపారు. ప్రజలు కరోనా రూల్స్ ను పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

'కేసులు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది చాలా కలవరపెట్టే విషయం. మన దగ్గర హెర్డ్ ఇమ్మునిటీ ఎంత ఉందనే దాని మీద సరైన డేటా కూడా లేదు. ప్రజల్లో అత్యధికులకు వైరస్ సోకి ఉండే అవకాశాలు ఎక్కువ. వైరస్ లో కొత్త రకాలు పుట్టుకొస్తుండటం మంచిది కాదు. భారీ జనాభా ఉన్నందున పెద్ద మొత్తంలో డోసుల ఆవశ్యకత ఉంది. ప్రాధాన్యతల వారీగా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకు కరోనా టీకా మీద ట్రయల్స్ ను వేగవంతం చేయాలి. అలాగే ఆర్టీపీసీఆర్ టెస్టులను ముమ్మరం చేయాలి' అని గులేరియా పేర్కొన్నారు.