మరి కొన్ని గంటల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు

మరి కొన్ని గంటల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు

మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు బలంగా వీస్తున్నాయని చెప్పింది. వచ్చే మూడ్రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, గుజరాత్ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని... రాయలసీమలో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది.