
న్యూఢిల్లీ: పది గ్రాముల గోల్డ్ ధర బుధవారం రూ.400 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రేటు రూ.65,950 కి దిగొచ్చింది. గ్లోబల్‌గా గోల్డ్ రేటు పడుతోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. మరోవైపు కేజీ వెండి ధర ఢిల్లీలో బుధవారం రూ.600 తగ్గి రూ.75,300 కి దిగొచ్చింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర బుధవారం రూ.420 తగ్గి రూ.65,820 కి, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.390 తగ్గి రూ.60,350 కి దిగొచ్చింది. కేజి వెండి ధర రూ.1,000 తగ్గింది. రూ.78,500 పలుకుతోంది.