రష్యాలోనే ప్రిగోజిన్

రష్యాలోనే ప్రిగోజిన్

మాస్కో: వాగ్నర్​ గ్రూప్​ చీఫ్​ ప్రిగోజిన్ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్​లో ఉన్నట్లు బెలారస్​ అధ్యక్షుడు అలెగ్జాండర్​ లుకషెంకో గురువారం వెల్లడించారు. వాగ్నర్​ ట్రూప్స్ మాత్రం అంతకుముందున్న క్యాంప్​ల్లోనే ఉన్నాయని చెప్పారు. కానీ వాగ్నర్​ బలగాల శిబిరాలు ఎక్కడ ఉన్నాయనే ఖచ్చితమైన స్థానాలను ఆయన వెల్లడించలేదు. 

కాగా, సెయింట్​  పీటర్స్ బర్గ్​లోని ప్రిగోజిన్ ప్యాలెస్‌‌లో రష్యా భద్రతా బలగాలు ఇటీవల సోదాలు చేసినట్లు అధికారులు చెప్పారు. గన్స్, మందుగుండు సామగ్రి, బంగారు కడ్డీలు, విగ్గుల వంటివి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్యాలెస్ లో కుప్పలుగా పడి ఉన్న 60 కోట్ల రూబుల్స్ నోట్ల కట్టలను కూడా భద్రతా బలగాలు సీజ్ చేశాయి.