ది ఎలిఫెంట్ విస్పర్స్'లో నటించిన బొమ్మన్, బెల్లీ దంపతులతో ప్రధాని మోడీ ముచ్చట

 ది ఎలిఫెంట్ విస్పర్స్'లో నటించిన బొమ్మన్, బెల్లీ దంపతులతో ప్రధాని మోడీ ముచ్చట

ఆస్కార్ అవార్డు అందుకున్న ఎలిఫెంట్ విస్పర్స్ అనే తమిళ డాక్యుమెంటరీ తీసిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.  కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ను సందర్శించిన ప్రధాని మోదీ.. అక్కడ ఫ్రంట్ లైన్ ఫీల్డ్ స్టాఫ్.. సంరక్షణ చర్యల్లో నిమగ్నమైన స్వయం సహాయక బృందాన్ని కలిశారు. ఆ తర్వాత ఆస్కార్ అవార్డు దక్కించుకున్న డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పర్స్'లో నటించిన బొమ్మన్, బెల్లీ దంపతులను కలిసి వారిని అప్యాయంగా పలుకరించారు. ఆస్కార్ గెలుచుకున్న ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీ ప్రకృతికి.. జీవులకు మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది...దేశ గిరిజన సమాజం జీవితం, సంప్రదాయం నుండి ఏదైనా తీసుకోవాలని నేను విదేశీయులను కోరుతున్నాను... అని ప్రధాని మోడీ  ట్వీట్ చేశారు.

https://twitter.com/narendramodi/status/1644975975929888768

ది ఎలిఫెంట్ విస్పర్స్' డాక్యుమెంటరీలో కనిపించిన రఘు అనే ఏనుగును కూడా ప్రధాని మోడీ చూశారు. బొమ్మన్, వల్లితో మోదీ కాసేపు ముచ్చటించారు. బొమ్మన్, వల్లితో పాటు..తెప్పకాడు లోని ఏనుగు సంరక్షణ కేంద్రంలో ఉన్న సిబ్బందిని సత్కరించారు. 

https://twitter.com/narendramodi/status/1644974611438899200

నీలగిరి జిల్లా మదుమలై అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణతో పాటు ఏనుగుల సంరక్షణ కేంద్రం  కూడా ఉంది.  తప్పి పోయిన ఏనుగులను రక్షించి ఇక్కడ పెంచుతుంటారు. అటవీ ప్రాంతంలోనే ఈ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం. 

https://twitter.com/ANI/status/1644938201264689152