బండి సంజయ్ను అభినందించిన ప్రధాని మోడీ

బండి సంజయ్ను అభినందించిన ప్రధాని మోడీ

తెలంగాణ పర్యటనపై ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బేగంపేటలో అడుగుపెట్టినప్పటి నుంచి.. రామగుండం ఎరువుల  ఫ్యాక్టరీ సందర్శన, జాతీయ రహదారుల జాతికి అంకితం, బహిరంగ సభ వరకు జరిగిన ఏర్పాట్లు బాగున్నాయని బండి సంజయ్కు మోడీ కితాబిచ్చారని చెప్పారు. 

తొలుత బేగంపేటలో స్వాగత సభ సమయంలో ‘‘నేనొక కార్యకర్తను. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశిస్తే మీ వద్దకు వచ్చాను’’ అని చెప్పిన మోడీ..ఆ సభలో ఉత్సాహంగా, ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సహా సీఎం కేసీఆర్ తీరును తూర్పారబట్టారు. అక్కడి నుంచి రామగుండం రావడంతోనే హెలిప్యాడ్ వద్ద స్వాగతం చెప్పేందుకు వచ్చిన బండి సంజయ్ను దగ్గరకు తీసుకుని ‘సంజయ్ బండిజీ... శభాష్..’అంటూ భుజం తట్టారు.

 

అక్కడి నుంచి రామగుండం ఎరువుల కర్మాగారం సందర్శన, బహిరంగ సభకు వచ్చే ముందు, సభలో మాట్లాడిన తరువాత కూడా మోడీ పలుమార్లు బండి సంజయ్ భుజం తడుతూ ‘‘బండి జీ.. ఏర్పాట్లు చాలా బాగున్నాయి’’ అంటూ అభినందించారు. ప్రధాని మోడీ పదేపదే బండి సంజయ్ను భుజం తడుతూ అభినందిస్తుండటాన్ని గమనించిన బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.