
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్‌వేద్ మహామందిరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (డిసెంబర్ 18న) వారణాసిలో ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఈ కేంద్రాన్ని పరిశీలించారు. ఒకేసారి 20 వేల మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్నారు మోదీ.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ఇక్కడ గడిపే ప్రతిక్షణం తనకు ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పారు. తనకు కాశీ ఎప్పుడూ తమ సొంతింటికొచ్చిన అనుభూతినిస్తుందన్నారు. సాధువుల మార్గదర్శకత్వంలో జరిగిన నూతన నిర్మాణాలు, అభివృద్ధి విషయంలో కాశీ ప్రజలు సరికొత్త రికార్డులు సృష్టించారని, అందుకు ఈ మహామందిరం ఓ నిదర్శనం అని చెప్పారు. ఇక నిన్న సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం రెండో ఎడిషన్‌ను ప్రధాని ప్రారంభించారు.