43 సార్లు పెట్రో రేట్లను పెంచిన ఘనత మోడీది

43 సార్లు పెట్రో రేట్లను పెంచిన ఘనత  మోడీది

ఒక్క ఏడాదిలోనే  పెట్రోల్ ధర రూ. 25 డీజిల్ ధర 23 రూపాయలు పెరిగాయన్నారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి. నలభై మూడు సార్లు పెట్రో రేట్లను పెంచిన ఘనత ప్రధాని మోడీ దన్నారు. మోడీ, కేసీఆర్ విధానాలతో మధ్యతరగతి ప్రజల జీవితాలు ఆగమవుతున్నాయని విమర్శిచారు. AICC పిలుపుతో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఉత్తం కుమార్ రెడ్డి.

ప్రజలపై భారం వేయడం లో కేసీఆర్, మోడీ పాత్ర అమోఘమన్నారు. వీరి నిర్ణయాలతో అసలు టాక్స్ లు కంటే ఎక్కువ టాక్స్ లు కడుతున్నామని తెలిపారు. కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని రకాల టాక్స్ లు పెరిగాయన్నారు. 2014- 2018 వరకు పెట్రోల్ డీజిల్ టాక్స్ ల ద్వారా 11 లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు. 2014లో పెట్రోల్ మీద ఎక్సైజ్ ట్యాక్స్  రూ.9 అంటే ఈరోజు 32 రూపాయలు అయ్యిందన్నారు. 2014లో డీజిల్ మీద ఎక్సైజ్ డ్యుటీ మూడు రూపాయలు ఉంటే ఈరోజు 31 కి చేరుకుందన్నారు.

దేశంలోనే అత్యంత ఎక్కువ వ్యాట్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోందన్నారు ఉత్తం కుమార్ రెడ్డి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే భారతదేశంలో టాక్స్ ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క దేశాల్లో పెట్రోల్ ధరలు 50 రూపాయలు లోపే ఉంటే.. మనదేశంలో వంద రూపాయలు పైనే ఉన్నాయన్నారు.