మన ఎకానమీ భేష్​! .. జీడీపీ వేగంగా పెరుగుతోంది : మోదీ

మన ఎకానమీ భేష్​! .. జీడీపీ వేగంగా పెరుగుతోంది : మోదీ
  • మన ఎకానమీ భేష్​! ..
  • జీడీపీ వేగంగా పెరుగుతోంది
  • సంస్కరణలతో సత్తా చాటాం
  • ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, భారీగా పెరుగుతున్న జీడీపీ రేటే దీనికి రుజువు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్​ గిఫ్ట్​ సిటీలో జరిగిన 'ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0' కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి ఆయన వీడియో లింక్ ద్వారా శనివారం మాట్లాడారు. మన పురోగతికి గత దశాబ్దంలో తీసుకొచ్చిన సంస్కరణలు కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత  ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో  జీడీపీ 7.7 శాతం పెరగడం  అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు నిదర్శనమని మోదీ ప్రశంసించారు.

" నేడు  ప్రపంచం మొత్తం భారతదేశంపై తన ఆశలు పెట్టుకుంది.  ఈ పరిస్థితి తీసుకురావడానికి చాలా చేశాం. గత 10 సంవత్సరాలలో అమలు చేసిన సంస్కరణలే ఇందుకు కారణం" అని మోదీ తన ప్రారంభ ప్రసంగంలో అన్నారు.  గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (గిఫ్ట్) సిటీని అత్యాధునిక గ్లోబల్ ఫైనాన్షియల్  టెక్నలాజికల్ సేవలకు కేంద్ర బిందువుగా మార్చుతామని హామీ ఇచ్చారు.  గిఫ్ట్​ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్​ఎస్​సీ) కీలక కేంద్రంగా ఎదిగిందని, గ్లోబల్​ ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ రంగంలో భారతదేశం ఎన్నో విజయాలను సాధించిందని తెలిపారు. సస్టెయినబుల్‌​ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ప్రముఖ పాత్ర పోషించాలని, గ్రీన్ క్రెడిట్ల కోసం మార్కెట్ మెకానిజం ఏర్పాటుకు ఆలోచనలు అందించాలని నిపుణులను మోదీ కోరారు.

గిఫ్ట్,​ ఐఎఫ్​ఎస్​సీ భారతదేశ  ఆర్థిక లక్ష్యాలకు సాధించడానికి సాయపడతామని,  గ్లోబల్​ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌లోనూ కీలక పాత్ర పోషించాలని వీటికి పిలుపునిచ్చారు. తక్కువ-కార్బన్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి  గ్రీన్ బాండ్లు, సస్టెయినబుల్‌​ బాండ్లు,   సస్టెయినబుల్‌ లింక్డ్‌ బాండ్ల వంటి సాధనాల ద్వారా అవసరమైన గ్రీన్ క్యాపిటల్ ప్రవాహాన్ని అందించడంలో గిఫ్ట్,​ ఐఎఫ్​ఎస్​సీలు సత్తా చాటుతున్నాయని ప్రధాని ప్రశంసించారు.  

 2025 చివరి నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్​ 

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

డెహ్రాడూన్: 2025 చివరి నాటికి భారత్‌‌‌‌‌‌‌‌ 5 ట్రిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌ షా శనివారం అన్నారు. డెహ్రాడూన్​లోని అటవీ పరిశోధనా సంస్థలో జరిగిన ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  వేడుకను ఉద్దేశించి షా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ  దూరదృష్టి గల నాయకత్వం కారణంగా భారతదేశం గత దశాబ్దంలో అన్ని రంగాలలో చాలా అభివృద్ధి చెందిందని అన్నారు.

"ప్రపంచం నేడు భారతదేశం వైపు ఆశతో చూస్తోంది. 2014– 2023 మధ్య, భారతదేశం ప్రపంచంలోని 11వ స్థానం నుంచి ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో దేశం ఇంతకు ముందెన్నడూ లేనంతగా దూసుకుపోయింది”అని పేర్కొన్నారు. వీటన్నింటికీ మోదీ దూరదృష్టి గల నాయకత్వమే కారణమని మెచ్చుకున్నారు.  మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా జీడీపీకి వేగాన్ని పెంచుతున్నారని చెప్పారు.  జీ-–20లో ఢిల్లీ డిక్లరేషన్ దౌత్య రంగంలో భారతదేశం సాధించిన పెద్ద విజయమని, దీనిని ప్రపంచం రాబోయే దశాబ్దాలుగా గుర్తుంచుకుంటుందని మంత్రి అన్నారు.

‘‘గత పదేళ్లలో దేశ తలసరి ఆదాయం రెండింతలు పెరిగింది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ విజయాలను ఐఎంఎఫ్ కూడా గుర్తించింది. 2027 నాటికి, జపాన్  జర్మనీలను అధిగమించి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిర్భవిస్తుందని మోర్గన్​ స్టాన్లీ ప్రకటించింది. ఇవన్నీ శుభ సంకేతాలు”అని ఆయన పేర్కొన్నారు.