జనవరి 22న ప్రధాని మోదీ షెడ్యూల్..

జనవరి 22న ప్రధాని మోదీ షెడ్యూల్..

అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఇంకా కొన్ని గంటలే ఉంది. రామ్ లల్లా ప్రతిష్ఠాపనలో ప్రధాని మోదీ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. రామ మందిర  ప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న ప్రధాని మోదీ పూర్తి అయోధ్య షెడ్యూల్.. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా ..

  • ఉదయం 10.25 గంటలకు కొత్త మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు, 
  • ఉదయం 10.45 గంటలకు ప్రధాని మోదీ అయోధ్య లోని హెలిప్యాడ్ చేరుకుంటారు. 
  • ఉదయం 10.55 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ లేదా శంకుస్థాపన కార్యక్రమం కోసం ప్రధాని శ్రీరామ జన్మభూమికి చేరుకుంటారు. 
  • మధ్యాహ్నం 12.05-12.55 గంటల మధ్య ఎంతగానో ఎదురు చూస్తున్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా వేడుక జరుగుతుంది. 
  • మధ్యాహ్నం 1.00 గంటలకు శంకుస్థాపన పూర్తియన తర్వాత ప్రధాని మోదీ బహిరంగ కార్యక్రమం జరిగే ప్రదేశానికి చేరుకుంటారు 
  • మధ్యాహ్నం 1.00-2.00 గంటల మధ్య ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. గంటపాటు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 
  • మధ్యాహ్నం 2.00 గంటలకు అయోధ్యలోని కుబేర్ తిలా ఆలయంలో ప్రార్థనలు చేస్తారు.