చీర్స్ కొట్టారు : మోదీ – బిడెన్ తాగింది మందు కాదు.. అల్లం కషాయం

చీర్స్ కొట్టారు : మోదీ – బిడెన్ తాగింది మందు కాదు.. అల్లం కషాయం

 రెండు దేశాల నాయకులు కలిసి డిన్నర్ చేస్తే రక రకాలుగా ఊహించుకుంటారు.  ఇచ ఛీర్స్ కొడితే..ఇంకేముంది మందు కొట్టినట్టే .. అనే కదా  దాని అర్దం.  ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత ప్రధాని మోదీ మధ్య అలాంటి సీన్ జరిగింది.  అయితే మోడీ మద్యం సేవించాడనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఇంతకూ మోడీ ఏం సేవించారనేదేనా.. మీసందేహం.. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.   . ..

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 22 న వైట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ డిన్నర్‌లో పాల్గొన్నారు. భారత ప్రధాని కోసం   అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ప్రత్యేక విందును  ఏర్పాటు చేశారు. విందు ఏర్పాట్లను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ స్వయంగా పర్వవేక్షించారు. రుచికరమైన శాఖాహార వంటలను సిద్ధం చేయాలని చీఫ్ చెఫ్ నీనా కర్టెస్‌కు జిల్ బైడెన్ ఆదేశించారు. 

సంగీత కార్యక్రమం

గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం జూన్ 23  ఉదయం) ప్రధాని మోదీ గౌరవార్ధం బైడెన్ దంపతులు అధికారిక విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీ అవార్డ్ విన్నర్ జోషువా బెల్, దక్షిణాసియా మ్యూజిక్ గ్రూప్ పెన్ మాసలాల సంగీత కార్యక్రమాన్ని జిల్ బైడెన్  ఏర్పాటు చేశారు. తెలిపారు. 

ఆల్కహాల్ తీసుకోకుండా మోడీ డిన్నర్ ముగించారు : బైడెన్

భారత ప్రధాని మోడీ శాఖాహారి కావడంతో పూర్తిగా శాఖాహార వంటకాలు ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే బైడెన్ మోడీపై ఓ జోక్ వేశారు. ఇది విని ప్రధాని మోదీ పగలబడి నవ్వారు. ఆల్కహాల్ తీసుకోకుండానే మోడీ డిన్నర్ ముగించేశారంటూ బైడెన్ అన్న మాటకు మోడీ గట్టిగా నవ్వారు. అంతే కాదు. తమ ఇద్దరికీ మద్యం సేవించే  అలవాటు లేదని చెప్పారు.  ఈ సందర్భంలో "మా తాతయ్య నాకో సలహా ఇచ్చాడన్న  బైడెన్ ... నీ గ్లాస్‌లో వైన్‌ కాకుండా మరే డ్రింక్‌ ఉన్నా దాన్ని ఎడమ చేతితో పట్టుకోవాలని తాగాలని చెప్పాడు. నేనేమీ జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నా. మరో మంచి విషయం ఏంటంటే..మా ఇద్దరికీ ఆల్కహాల్ తీసుకునే అలవాటు లేదు" అని అమెరికా అధ్యక్షుడు అన్నారు. 


 రెండు పవర్‌ఫుల్ దేశాలకు ఛీర్స్

ఈ కామెంట్స్ చేసిన వెంటనే మోడీ నవ్వారు. ఆ తరువాత పక్కనే ఉన్న ట్రాన్స్‌లేటర్ బైడెన్ కామెంట్స్‌ని హిందీలో అనువదించి చెప్పారు. ఇది విన్నాక ఒక్కసారిగా హాల్‌లో ఉన్న వారంతా నవ్వడం మొదలు పెట్టారు.  మోడీ  కూడా పదేపదే గుర్తు చేసుకుని నవ్వుకున్నారు.  అయితే భారత ప్రధాని సేవించింది మాత్రం అల్లం నీరని తెలుస్తోంది. భవిష్యత్‌లో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని వెల్లడించారు. రెండు పవర్‌ఫుల్ దేశాలకు ఛీర్స్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. 

ప్రధాని మోడీ కోసం ఏర్పాటు చేసిన విందులో ఎన్నో స్పెషల్ అరేంజ్‌మెంట్స్ చేశారు. మోడీ కి అందించనున్న ఫుడ్ ఐటమ్స్‌ ఏంటో పెద్ద లిస్ట్ కూడా ప్రకటించింది వైట్‌హౌజ్. ప్రతి టేబుల్‌ని భారత త్రివర్ణ పతాకం రంగులో డెకరేట్ చేశారు. మోడీ  వెజిటేరియన్ అవడం వల్ల మరింత స్పెషల్‌ ఐటమ్స్‌ వండించారు. మిల్లెట్ కేక్, వాటర్‌మెలన్, అవకాడో సాస్, స్ట్రాబెర్రీ కేక్‌ ఇలా రకరకాల వంటకాలు వడ్డించారు. అగ్రరాజ్యం అమెరికాలో కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగం అందర్నీ మంత్రముగ్దులను చేసింది. 

ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావిస్తూనే వాటికి పరిష్కారాలను కూడా చెప్పారు మోడీ . అదే టైంలో అమెరికా, భారత్ మధ్య ఉన్న బంధాన్ని  ప్రస్తావించారు. ఈ జోడీ ప్రపంచానికి ఎలా సహాయపడగలదో వివరించారు. అమెరికా కాంగ్రెస్‌లో ఉభయ సభలను ఉద్దేశించి మోడీ  చేసిన ప్రసంగం సుమారు గంటపాటు సాగింది. 2016లో చేసిన ప్రసంగం కంటే ఇది చాలా ఎక్కువ. అప్పట్లో  45 నిమిషాలు మాత్రమే మాట్లాడారు మోడీ . ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా అంశాలను తన స్పీచ్‌లో ప్రధాని ప్రస్తావించారు.  చాలా సార్లు మోదీ ప్రసంగానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్‌ సహా కాంగ్రెస్ సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో ప్రశంసించారు.

ALSOREAD:బాహుబలి ఏనుగుకు గాయాలు.. కారణం అది కాదంట

https://twitter.com/ANI/status/1672041317185236992