"ఆది మహోత్సవ్"ను ప్రారంభించిన మోడీ

"ఆది మహోత్సవ్"ను ప్రారంభించిన మోడీ

ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ "ఆది మహోత్సవ్"ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం  గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు.

"ఆది మహోత్సవ్"లో గిరిజనుల  వారసత్వాన్ని ఒకే వేదికపై 200 స్టాళ్లలో ప్రదర్శిస్తున్నారు. సుమారు 1000 మంది గిరిజన కళాకారులు ఈ మహోత్సవంలో పాల్గొంటున్నారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నందున చేనేత, కుండలు, హస్తకళలు, ఆభరణాలు వంటి సాధారణ ఆకర్షణలతో పాటు, గిరిజనులు పండించే ప్రత్యేక అన్నాన్ని  ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 27 వరకు ఆది మ‌హోత్సవ్ జరగనుంది.