సిక్కు గురువులకు ప్రధాని ఆతిథ్యం

సిక్కు గురువులకు ప్రధాని ఆతిథ్యం

న్యూఢిల్లీ: సిక్కు మత గురువులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆతిథ్యం ఇచ్చారు. శుక్రవారం తన నివాసంలో వారితో ఆయన భేటీ అయ్యారు. సిక్కుల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. మరో రెండ్రోజుల్లో పంజాబ్​ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​, అకాలీ దళ్ ​రెబల్​ వర్గంతో బీజేపీ జట్టుకట్టి బరిలోకి దిగుతున్న క్రమంలో సిక్కు ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సిక్కు మతపెద్దలతో మోడీ భేటీ అయ్యారు. సిక్కు కల్చర్​కు పేరు తీసుకురావడంలో, సామాజిక సేవలో ఆ మత గురువులు ముందుండి నడిపిస్తున్నారని మోడీ అన్నారు. ‘‘సిక్కు మత గురువులకు సేవ చేయడం ఆనందంగా ఉంది. కేంద్రం చేపడుతున్న పలు కార్యక్రమాలను వారు మెచ్చుకున్నరు. వారి దీవెనలతో సొసైటీ కోసం మరింత పనిచేస్తాను’’ అని మోడీ ట్వీట్​ చేశారు.