వారణాసి ఈరోజు అభివృద్ధి పండగని చూస్తోంది : ప్రధాని మోదీ

వారణాసి ఈరోజు అభివృద్ధి పండగని చూస్తోంది : ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో అక్టోబర్ 20న పర్యటించారు. రూ.6వేల 700 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు కాశీకి చాలా పవిత్రమైన రోజని.. దీపావళి, దంతేరాస్, ఛత్ పూజలకు ముందే వారణాసి అభివృద్ధి పండగ చూస్తోందని అన్నారు. ప్రధాని కంచి మఠంలో RJ శంకర కంటి ఆసుపత్రి ప్రారంభించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ.3వేల 200 కోట్ల విలువైన 16 అభివృద్ధి కార్యక్రమాలు వారణాసిలో ఏర్పాటు చేశారు. అందులో రూ. 2,870 కోట్ల అంచనా వ్యయంతో కొత్త టెర్మినల్, రన్‌వే పనులు ప్రారంభించారు. నోయిడాలోని జెవార్‌లో గ్రాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వారణాసి కొత్త అభివృద్ధి దశలోకి అడుగుపెడుతుందని ప్రధాని అన్నారు.

Also Read :- అంధకారంలో ఆదిలాబాద్.. 33 కేవీ సబ్ స్టేషన్ జంపర్ కట్

వంశపారంపర్య, బుజ్జగింపుల రాజకీయాలు వల్ల ఇన్ని గతంలో ఉత్తరప్రదేశ్ డెవలప్ మెంట్ కు నోచుకోలేదని ఆయన అన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లోనే రూ.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల గురించి ప్రతి ఇంట్లో చర్చలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలను టార్గెట్ చేస్తూ మోదీ విమర్శల వర్షం కురిపించారు. సబ్కా వికాస్ (అందరికీ అభివృద్ధి) సిద్ధాంతానికి బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, మంత్రుల బృందాన్ని మోదీ మెచ్చుకున్నారు.