రాష్ట్రపతితో ప్రధానిమోదీ భేటీ..‘‘ఆపరేషన్ సిందూర్’’పై వివరణ

రాష్ట్రపతితో ప్రధానిమోదీ భేటీ..‘‘ఆపరేషన్ సిందూర్’’పై వివరణ

భారత రాష్ట్రపతి, సర్వసైన్యాధ్యక్షులు ద్రౌపతి ముర్ముతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. పాకిస్తాన్ పై భారత్ సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్ సైనిక చర్యను రాష్ట్రపతికి వివరించారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులు, ఉగ్రవాదులను అంతమొందించిన తీరును ప్రధాని తెలిపారు.   

Prime Minister Shri @narendramodi called on President Droupadi Murmu at Rashtrapati Bhavan and briefed her about Operation Sindoor. pic.twitter.com/EjRulIdWbj

— President of India (@rashtrapatibhvn) May 7, 2025

పాకిస్తాన్ లో మొత్తం 9 ఉగ్రవాదుల అడ్డాగా ఉన్న ప్రదేశాలపై భారత వైమానిక దళం దాడులు జరిపింది. పాకిస్తాన్ కేంద్రం పనిచేస్తున్న ఉగ్రవాద సంస్తలు లష్కరే తోయిబా (LeT), జైషే మహ్మద్(JeM) ఉగ్రవాద ప్రధానా కార్యాలయాలు, శిక్షణా సంస్థలను లక్ష్యంగా తొమ్మిది ప్రదేశాల్లో వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రదేశాలనుంచే భారత్ లో ఉగ్రదాడికి ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. 

ఏప్రిల్22న జమ్మూకాశ్మీర్లోని పహల్గాం సమీపంలో బైసారన్ పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారని ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించారు.ఈక్రమంలో ఉగ్రవాదం అంతమొందించాలనే లక్ష్యంగా భారీత్ ఉగ్రస్థావరాలపై ఈ దాడులు జరిపినట్లు వెల్లడించారు. 

►ALSO READ | ట్రెండింగ్‎లో సిందూర్: అసలు సిందూర్ అంటే ఏమిటి..? హిందువులు దానికి అంత ప్రాముఖ్యత ఎందుకిస్తారు..?

మరోవైపు ప్రధాని మోదీ తన యూరప్ పర్యటనను రద్దు చేసుకున్నారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనను వాయిదా వేసుకున్నారు. క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ పర్యటన షెడ్యూల్ ఉండగా వాయిదా పడింది. మే 13నుంచి 17 వరకు నార్వేలో జరిగే నార్డిక్ సమ్మిట్ లో ప్రధాని మోదా పాల్గొనాల్సి ఉండగా వాయిదా వేశారు.