ముందస్తు జాగ్రత్తలు పాటించాలి

ముందస్తు జాగ్రత్తలు పాటించాలి

దేశంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైలెవెల్ మీటింగ్ జరిగింది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుక్ మాండవీయ, కేబినెట్ సెక్రటరీ, హోంశాఖ సెక్రటరీ, పౌర విమానయాన శాఖ కార్యదర్శి, హోంమంత్రి అమిత్ షా కూడా రివ్యూలో పాల్గొన్నారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుండటంతో ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. శనివారం దేశంలో లక్షా 59వేల 632 కరోనా కేసులు నమోదయ్యాయి. 327 మంది చనిపోయారు. పాజిటివిటీ రేట్ 10.21శాతానికి పెరిగింది. ఒమిక్రాన్ కేసులు కూడా 4వేలకు దగ్గరయ్యాయి. అనేక రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడులలో వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉంది.