గుడ్ న్యూస్ : వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గింపు

గుడ్ న్యూస్ : వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గింపు

మహిళా దినోత్సవం రోజున  మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు ప్రధాని మోదీ. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమ ప్రకటనతో   దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గతుందన్నారు.  ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. 

2025 వరకు సబ్సీడీ  

మార్చి 7న జరిగిన కేబినెట్ లో  ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) సబ్సిడీని దాని లబ్ధిదారులకు మార్చి 2025 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై  300 రూపాయల సబ్సిడీ కొనసాగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద కుటుంబాలకు అందించే వంటగ్యాస్ సబ్సిడీని 14.2 కిలోల సిలిండర్ కు దఫాలుగా కేంద్రం 2023 అక్టోబర్ లో 300కి పెంచింది. లబ్ధిదారులకు ఏడాదికి 12 రీఫిల్ ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.12వేల కోట్లు సబ్సిడీని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.