ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్

ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్

ఉక్రెయిన్‌లో పరిస్థితి దారుణంగా ఉన్నాయి. రష్యాదాడులతో ఉక్రెయిన్ ప్రజలు వణుకుతున్నారు. ఇప్పటికే అనేకమందిని అక్కడి సైన్యం కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దీంతో ఇప్పటికే అనేక దేశాలు రష్యా చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉక్రెయిన్ దేశానికి మద్దతు ప్రకటించాయి. తాజాగా ఉక్రెయిన్ పరిస్థితులపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం యూపీలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అక్కడ్నుంచి రాగానే ఈ భేటీ నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఉత్తరప్రదేశ్‌ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఉక్రెయిన్‌ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం సమావేశమవుతారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడి శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు సహకరించాలని సూచించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై మోదీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని క్షేమంగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది విద్యార్థులు, పౌరులు ప్రభుత్వం ఖర్చులతో భారత్‌కు తీసుకొచ్చారు.