ప్రారంభానికి శివమొగ్గ ఎయిర్ పోర్టు సిద్ధం..ఫోటోలు వైరల్..

ప్రారంభానికి శివమొగ్గ ఎయిర్ పోర్టు సిద్ధం..ఫోటోలు వైరల్..

కర్ణాటకలోని శివమొగ్గలో విమానాశ్రయం కల సాకారం కాబోతోంది. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన శివమొగ్గ ఎయిర్ పోర్టు ఈ నెల 27 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విమానాశ్రయాన్ని  ప్రధాని మోడీ ఈ నెల 27న ప్రారంభిస్తారు.  అందరికీ విమాన ప్రయాణం అందుబాటులో ఉండే లక్ష్యంతో ఉడాన్ స్కీమ్ కింద శివమొగ్గ జిల్లాలోని సోగానె గ్రామంలో 662.38 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ డొమెస్టిక్ ఎయిర్ పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఎయిర్ పోర్టు  ప్రారంభోత్సవం నేపథ్యంలో ఇప్పటికే ట్రయల్ రన్స్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఎయిర్ పోర్టు ఫోటోలు వైరల్ అయ్యాయి. 

ప్రారంభోత్సవం రోజు ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్న మొదటి విమానం మోదీదే కానుందని శివమొగ్గ ఎంపీ బీవై రాఘకేంద్ర తెలిపారు. ఈ ఎయిర్ పోర్టుతో వాణిజ్యం, కనెక్టివిటీ,పర్యాటకాన్ని మెరుగుపరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.  శివమొగ్గ విమానాశ్రయం 45 మీటర్ల వెడల్పు, 3,200 మీటర్ల పొడవు గల రన్‌వేని కలిగి ఉంది. ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత కొండ ప్రాంత ప్రజలకు విమాన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.