శనివారం బుందేల్ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించనున్న మోడీ 

శనివారం బుందేల్ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించనున్న మోడీ 

ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దాదాపు 14,850 కోట్ల వ్యయంతో 296 కి.మీ పొడవైన నాలుగు లేన్‌ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించారు. 2020 ఫిబ్రవరిలో మోడీ నాలుగు లేన్ల ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (UPEIDA)సహకారంతో 28 నెలల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి.ఈ ఎక్స్ ప్రెస్ వే యూపీ చిత్రకూట్‌లోని గోండా గ్రామం వద్ద NH-35 నుంచి రాష్ట్రంలోని ఇటావా జిల్లా వరకు విస్తరించింది. ఎక్స్‌ప్రెస్‌వే ప్రస్తుతం నాలుగు లేన్లను కలిగి ఉంది. అయితే దీనిని ఆరు లేన్‌ల ఎక్స్‌ప్రెస్‌వేగా విస్తరించవచ్చు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు చిత్రకూట్, బందా, మహోబా, హమీర్‌పూర్, జలౌన్, ఔరైయా,ఇటావా గుండా వెళుతుంది.ఈ ఎక్స్ ప్రెస్ వే బుందేల్ ఖండ్ లో నిర్మిస్తున్న డిఫెన్స్ కారిడార్ కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.