ప్రహ్లాద్​ మోడీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్​కు గాయాలు

ప్రహ్లాద్​ మోడీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్​కు గాయాలు

మైసూరు: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కర్నాటకలోని మైసూరులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రహ్లాద్ మోడీతో పాటు ఆయన కొడుకు, కోడలు, మనవడు మైసూరులోని బండిపూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్తుండగా కడకోల సమీపంలో వారి కారు డివైడర్‌‌‌‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వారిని దగ్గర్లోని జేఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ హాస్పిటల్​కు తరలించారు.