గ్రామీణ ప్రాంతాలు అలర్ట్‌గా ఉండాలె

గ్రామీణ ప్రాంతాలు అలర్ట్‌గా ఉండాలె

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రధాని మోడీ అన్నారు. రూరల్ ఏరియాల్లో ఉండే ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఆయన కోరారు. మహమ్మారి బారి నుంచి రక్షణగా విధిగా మాస్కులు కట్టుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. సెకండ్ వేవ్ ను కంట్రోల్ చేసేందుకు కేంద్రం యుద్ధ ప్రాతిపదికన పని చేస్తోందని తెలిపారు. వేగంగా తాత్కాలిక ఆస్పత్రులు, ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్ లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా చికిత్సలో కీలకమైన మెడిసిన్స్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్మకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మహమ్మారి పై యుధ్ధంలో గెలవాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. జలుబు, జ్వరం లాంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోవద్దని వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. వైరస్ వల్ల తమ వారిని కోల్పోయిన కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలను అన్నారు.