
ఎవరిలో విద్యార్థి లక్షణాలు ఉంటాయో వారు సక్సెస్ అవుతారని ప్రధాని మోదీ అన్నారు. తన సిక్రెట్ అదేనని చెప్పుకొచ్చారు. తనలో ఎప్పుడు ఓ విద్యార్థి ఉంటాడని తెలిపారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీఎంవో అధికారులను ఉద్దేశించి ఆయన తొలిసారి మాట్లాడారు. నేర్చుకునే తపన ఉండేవారు బద్ధకాన్ని దరిచేరనివ్వరు. శక్తిని కోల్పోరు. ఆశయాలపై స్థిరత్వం ఉంటే అది కార్యరూపం దాలుస్తుంది. దానిరి శ్రమ తోడైతే విజయం మిమ్మల్ని వరిస్తుందన్నారు మోదీ.
ప్రధాని ఆఫీసు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. మనమందరం కలిసి దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకు వెళ్లాలని చెప్పారు. దేశం ఫస్ట్ అనే నినాదంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. తాను ప్రతిక్షణం దేశాభివృద్ధి కోసం పాటుపడుతానని చెప్పుకొచ్చారు. 2047 వరకు 24/7 పనిచేస్తానని స్పష్టం చేశారు. పదేళ్లు అండగా నిలిచిన పీఎంవో అధికారులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.