
సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిక్కిం క్రాంతికారి మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండవసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గాంగ్‌టక్‌లోని పాల్జోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనచే ప్రమాణం చేయించారు. సోనమ్ లామా, అరుణ్ ఉప్రేతి, సందుప్ లెప్చా, భీమ్ హాంగ్ లింబూ, భోజ్ రాజ్ రాయ్, జిటి ధుంగెల్, పురుణ్ కుమార్ గురుంగ్ పింట్షో నమ్‌గ్యాల్ లెప్చా సిక్కిం ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాలకు గాను 31 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) అధికారంలోకి వచ్చి్ంది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF) షయారీ నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి సహకరించిన వారందరికీ ప్రేమ్ సింగ్ తమాంగ్ ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల సమయంలో చేసిన అన్ని హామీలను నెరవేరుస్తామని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వారు కష్టపడి పనిచేశారన్నారు అలాగే ప్రజలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.