
బంగారం అక్రమ రవణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికారలే షాక్ అయ్యేలా బంగారాన్ని దాచి దేశాలు దాటిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా చెన్నై విమానాశ్రయంలో సోమవారం కస్టమ్స్ అధికారులు ఓ సిబ్బంది నుంచి రూ.8 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు, విమానాశ్రయ సిబ్బంది, ట్రాన్సిట్ ప్రయాణీకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కస్టమర్ సపోర్ట్ స్టాఫ్‌గా పనిచేస్తున్న మహ్మద్ బర్కతుల్లా అనే వ్యక్తిని ఇంటెలిజెన్స్‌తో చెన్నై విమానాశ్రయంలో అడ్డుకున్నారు. అతడి నుంచి ఎయిర్‌పోర్టు డిపార్చర్ గేట్ వద్ద సోదాలు నిర్వహించి రబ్బర్ పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తదుపరి సోదాల్లో 13 కిలోల బరువున్న 24 క్యారెట్ల బంగారంతో నింపిన 36 పౌచ్‌లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం ధర రూ.8.04 కోట్లుగా లెక్కగట్టారు.మహ్మద్ బర్కతుల్లా కొలంబో వెళ్లే ప్రయాణీకుల నుంచి పౌచ్‌లను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
అదేవిధంగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు విదేశీ మహిళా ప్రయాణికుల నుంచి 32.79 కిలోల బంగారం పట్టుబడింది. లోదుస్తులు, బ్యాగుల్లో దాచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అదికారులు స్వాధీనం చేసుకున్నారు