ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని సమీక్ష

ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని సమీక్ష

దేశంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమగ్ర సమీక్ష చేశారు. హెల్త్, DPIIT,స్టీల్, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖల నుంచి ఇన్ పుట్స్ తీసుకున్నారు. ప్రస్తుత సరఫరాతో పాటు.. వచ్చే 15 రోజుల్లో వినియోగంపైనా రివ్యూ చేశారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉందని... ఆ రాష్ట్రాలపై ఒత్తిడి ఎక్కువగా ఉందని గుర్తించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో జిల్లా స్థాయి పరిస్థితిని అధికారులు ప్రధాని ముందు ప్రజెంట్ చేశారు. రాష్ట్రాలు, కేంద్రంతో రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉండాలని మోడీ సూచించారు. డిమాండ్ అంచనాపై ఈ నెల 20, 25, 30న డీటెయిల్స్ షేర్ చేసుకోవాలన్నారు. ఈ నెల 20న 4,880 మెట్రిక్ టన్నులు, 25న 5,619 మెట్రిక్ టన్నులు, 30న 6,593 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆ 12 రాష్ట్రాలకు కేటాయించాలని మోడీ ఆదేశించారు. 

దేశంలో ఆక్సిజన్ ప్రొడక్షన్ కెపాసిటీ, పెరుగుతున్న డిమాండ్ గురించి అధికారులు మోడీకి వివరించారు. ప్రతీ ప్లాంట్‌లోనూ కెపాసిటీ మేరకు ఆక్సిజన్ ప్రొడక్షన్ పెంచాలని మోడీ ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంకర్లు దేశమంతటా స్వేచ్ఛగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని మోడీ అధికారులకు సూచించారు. ఆక్సిజన్ సరఫరా వాహనాలు దేశంలో ఎక్కడికైనా వెళ్లేలా ఉండాలని... వాటిపై ఆంక్షలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఆక్సిజన్ సిలిండర్ ఫిల్లింగ్ ప్లాంట్స్ 24గంటల పాటు పనిచేసేలా పర్మిషన్ ఇవ్వనున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్ల డ్రైవర్లు షిఫ్ట్ పద్దతుల్లో పనిచేసేలా చూడాలని మోడీ ఆదేశించారు. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సిలిండర్లను కూడా మెడికల్ యూసేజ్‌కు ప్రభుత్వం అనుమతిస్తోందని ప్రధానమంత్రి ఆఫీస్ తెలిపింది. నెట్రోజన్ ట్యాంకర్లను కూడా ఆక్సిజన్ ట్యాంకర్లుగా కన్వర్ట్ చేసేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని PMO తెలిపింది.